Konaseema District: రౌడీ షీటర్ల వల్లే అమలాపురంలో అల్లర్లు: డీఐజీ పాలరాజు
![18 accused arrested in amalapuram clashes](https://imgd.ap7am.com/thumbnail/cr-20220526tn628fa395c50e0.jpg)
- అల్లర్లకు పాల్పడిన 19 మంది అరెస్ట్
- శుక్రవారం మరికొంత మందిని అరెస్ట్ చేస్తాం
- అరెస్టులు పూర్తయ్యాకే ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ అన్న పాలరాజు
కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లపై ఏలూరు రేంజి డీఐజీ పాలరాజు గురువారం కీలక వివరాలు వెల్లడించారు. నేడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన.. అల్లర్లలో పాలుపంచుకున్న వారిలో ఇప్పటిదాకా 19 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. అంతేకాకుండా అమలాపురం అల్లర్లకు రౌడీ షీటర్లే కారణమని కూడా ఆయన పేర్కొన్నారు.
అల్లర్లలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించామని, శుక్రవారం మరికొందరిని అరెస్ట్ చేయనున్నట్లు ప్రకటించారు. అనుమానితుల అరెస్టులు పూర్తయ్యే దాకా జిల్లాలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అరెస్టులు ముగిశాక దశలవారీగా ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామని పాలరాజు చెప్పారు.