JC Prabhakar Reddy: చంద్రబాబు బర్త్ డే విషెస్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందన!
![jc prabhakar reddy overwhelmed by chandrababu birth day wishes](https://imgd.ap7am.com/thumbnail/cr-20220525tn628dedffab248.jpg)
- నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి బర్త్ డే
- ప్రజల ఆశీర్వాదబలంతో వర్ధిల్లాలంటూ చంద్రబాబు గ్రీటింగ్స్
- చంద్రబాబు గ్రీటింగ్స్‌పై అమితాశ్చర్యం వ్యక్తం చేసిన జేసీ
- బాబు దీవెనలతో ఈ ఏడాది తనకు అద్భుతమేనని రీ ట్వీట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జన్మదినం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ ట్వీట్ పెట్టారు. మరెన్నో పుట్టినరోజులను సుఖసంతోషాలతో జరుపుకోవాలని.. ప్రజల ఆశీర్వాదబలంతో నిండు నూరేళ్లూ ఆనందారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానంటూ సదరు పోస్టులో జేసీకి చంద్రబాబు గ్రీటింగ్స్ చెప్పారు.
తనకు బర్త్ డే విషెస్ చెబుతూ చంద్రబాబు ట్వీట్ చేయడం పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అమితానందానికి లోనయ్యారు. తన జన్మదినాన్ని గుర్తు పెట్టుకుని మరీ చంద్రబాబు తనకు విషెస్ చెప్పడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు అందించిన ఆశీస్సులతో తనకు ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతోందని భావిస్తున్నానని కూడా జేసీ చెప్పుకొచ్చారు.