Vijayasai Reddy: అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai slams tdp

  • మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయిందన్న విజ‌య‌సాయిరెడ్డి
  • పిచ్చి కూతలు కూస్తున్నాడు అంటూ విమర్శలు 
  • ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల అందరి పరిస్థితి ఇలాగే తయారైందని చుర‌క‌

టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ''అయ్యన్న మెంటల్ కండిషన్ ఆందోళనకరంగా మారింది. మెదడుకి, నాలుకకు మధ్య ‘హుందాతనం’ అనే లింకు తెగిపోయి పిచ్చి కూతలు కూస్తున్నాడు. వైజాగ్ మెంటల్ హాస్పిటల్ లో బెడ్ సిద్ధం చేయక తప్పేలా లేదు. ఓటమి తెచ్చిన ఫ్రస్ట్రేషన్ వల్ల బాబు నుంచి కింది వరకు అందరి పరిస్థితి ఇలాగే తయారైంది'' అని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. 

ఏపీ సీఎం జ‌గ‌న్ దావోస్ లో పర్య‌టిస్తోన్న నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. ''దావోస్ వెళ్లి బాబు ఏం చేశాడో, ఏం తీసుకొచ్చాడో ఇన్నాళ్లు ఎవరూ పట్టించుకోలేదు. పాత వీడియోలు చూస్తే రాష్ట్రం పరువు తీసొచ్చాడని మాత్రం అర్థమవుతోంది. తన పాలనలో నేరాలే జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. 2016-19 మధ్య రాష్ట్రంలో 1,44,703 నేరాలు నమోదైనట్టు ఎన్‌సీఆర్బీ వెల్లడించింది'' అని ఆయ‌న పేర్కొన్నారు. 

Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News