IPL: రేపటి నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్... షెడ్యూల్ ఇదిగో!

IPL Playoffs schedule

  • ముగింపు దశకు ఐపీఎల్-15
  • పూర్తయిన లీగ్ పోటీలు
  • మే 24న తొలి క్వాలిఫయర్
  • గుజరాత్ వర్సెస్ రాజస్థాన్
  • మే 29న ఐపీఎల్ ఫైనల్

గత మార్చి 26 నుంచి క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ చరమాంకంలో ప్రవేశించింది. నిన్నటితో టోర్నీ లీగ్ దశ ముగియగా, రేపటి నుంచి ప్లే ఆఫ్ దశ షురూ కానుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన గజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్ దశకు చేరుకున్నాయి. 

మే 24న జరిగే తొలి క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు దూసుకెళుతుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. 

మే 25న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కు అర్హత సాధిస్తుంది. 

ఈ నెల 27న రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ విజేత ఈ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్ చేరుకున్న జట్టుతో టైటిల్ కోసం పోటీపడుతుంది. 

కాగా, మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తో పాటు ఫైనల్స్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.

IPL
Play Offs
Schedule
Qualifier
Eliminator
Final
  • Loading...

More Telugu News