Rajasekhar: 'శేఖర్' చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి ప్రదర్శనలు నిలిపివేయించారు: రాజశేఖర్
![Rajasekhar statement on Sekhar movie](https://imgd.ap7am.com/thumbnail/cr-20220522tn628a091db7000.jpg)
- రాజశేఖర్ హీరోగా శేఖర్ చిత్రం
- జీవిత దర్శకత్వం
- ఈ నెల 20న రిలీజ్
- సంచలన ఆరోపణలు చేసిన రాజశేఖర్
యాంగ్రీ హీరో రాజశేఖర్ కథానాయకుడుగా నటించిన చిత్రం శేఖర్ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ఆత్మీయ రాజన్, ముస్కాన్ నటించారు. ఇందులో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కూడా నటించారు. అయితే, రాజశేఖర్ నేడు సంచలన ప్రకటన చేశారు. తన శేఖర్ చిత్రానికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేసి, చిత్ర ప్రదర్శనలు నిలిపివేయించారని ఆరోపించారు. సినిమాయే తమకు లోకమని, ముఖ్యంగా ఈ శేఖర్ చిత్రంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
"శేఖర్ చిత్రాన్ని నేను, నా కుటుంబం మా సర్వస్వంగా భావించాం. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేం ఎంతో కష్టపడ్డాం. శేఖర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కానీ, ఇంతలోనే కొందరు కావాలనే మా చిత్రాన్ని అడ్డుకుంటున్నారు. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు.... ఎవరెన్ని చేసినా ఈ చిత్రం ప్రదర్శితమై, ప్రశంసలు పొందుతుందని, ఆ అర్హత ఈ సినిమాకు ఉందని నేను భావిస్తున్నాను" అంటూ రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220522fr628a0914ac370.jpg)