CPI Ramakrishna: ఎమ్మెల్సీ అనంత‌బాబును వెంట‌నే అరెస్టు చేయాలి: సీపీఐ రామ‌కృష్ణ‌

anantababu should be arrested demands ramakrishna
  • రేపు విజ‌య‌వాడ‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హిస్తామ‌న్న రామ‌కృష్ణ‌
  • డ్రైవ‌ర్ కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని డిమాండ్
  • ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని విజ్ఞ‌ప్తి
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న‌పై నేడు విజ‌య‌వాడ‌లో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నామ‌ని సీపీఐ నేత రామ‌కృష్ణ ప్ర‌క‌టించారు. అనంత ఉద‌య్ భాస్క‌ర్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. 

డ్రైవ‌ర్ కుటుంబానికి రూ.కోటి ప‌రిహారం ఇవ్వాల‌ని ఆయ‌న అన్నారు. సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి చెందిన ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. మ‌రోవైపు అనంతబాబును అరెస్టు చేయాల‌ని ఏపీసీఎల్ఏ అధ్య‌క్షుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. ఏపీ స‌ర్కారుకి చిత్త‌శుద్ధి ఉంటే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని ఆయ‌న చెప్పారు.
CPI Ramakrishna
ananta babu
cpi

More Telugu News