Roja: ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ లో మంత్రి రోజా... ఫొటోలు ఇవిగో!

Roja visits Rock Gardens at Orvakallu
  • టూరిజం మంత్రిగా రోజా విస్తృత పర్యటనలు
  • కర్నూలు జిల్లాలోని రాక్ గార్డెన్స్ లో రోజా సందడి
  • టూరిస్టు స్పాట్ గా అద్భుతమని వెల్లడి
ఏపీ టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా రాష్ట్రంలోని అనేక పర్యాటక స్థలాలను వరుసగా సందర్శిస్తున్నారు. తాజాగా ఆమె కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఉన్న రాక్ గార్డెన్స్ (రాతి ఉద్యానవనం)కు విచ్చేశారు. తన పర్యటనపై రోజా ట్విట్టర్ లో వెల్లడించారు. ఇక్కడ ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో రాతి రెస్టారెంట్, కేవ్ మ్యూజియం, బోటింగ్, పిక్నిక్ స్పాట్లు, హరిత రిసార్టు ద్వారా వసతి అందిస్తున్నట్టు రోజా వెల్లడించారు. ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ పర్యాటక ప్రదేశంగా చాలా అద్భుతంగా ఉంటుందని పేర్కొన్నారు. 

రాక్ గార్డెన్స్ ప్రాంతం పర్యాటకం పరంగానే కాకుండా, సినిమా షూటింగులకు కూడా ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ గతంలో జయం మనదేరా, టక్కరిదొంగ, సుభాష్ చంద్రబోస్, బాహుబలి వంటి సినిమాలను చిత్రీకరించారు. ఈ రాక్ గార్డెన్స్ కర్నూలు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి నంద్యాల వెళ్లే రహదారి పక్కనే ఓర్వకల్లుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఇది కొలువై ఉంది.
Roja
Rock Gardens
Orvakallu
Tourism
YSRCP
Andhra Pradesh

More Telugu News