Nara Lokesh: చంద్రన్న మార్గమే రాజమార్గం!... జగన్ దావోస్ టూర్‌పై నారా లోకేశ్ కామెంట్!
![nara lokesh satires on ys jagan davos tour](https://imgd.ap7am.com/thumbnail/cr-20220520tn628797fc88d26.jpg)
- భార్యతో కలిసి దావోస్ బయలుదేరిన జగన్
- నాడు దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్నారుగా అంటూ లోకేశ్ ప్రశ్న
- ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాల్సి వచ్చిందంటూ ఎద్దేవా
- బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమోనన్న లోకేశ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మొదలుపెట్టిన దావోస్ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దావోస్‌లో ఈ నెల 22న ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించనున్న సదస్సులో పాలుపంచుకునే ఏపీ ప్రతినిధి బృందానికి సీఎం జగన్ నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం సతీసమేతంగా జగన్ దావోస్ బయలుదేరారు. గతంలో ఏపీ సీఎం హోదాలో ఈ సదస్సులకు చంద్రబాబు హాజరైన విషయాన్ని గుర్తు చేస్తూ జగన్ పర్యటనపై నారా లోకేశ్ సెటైర్లు సంధించారు.
![](https://img.ap7am.com/froala-uploads/20220520fr628797f686404.jpg)