Kangana Ranaut: రూ.3.6 కోట్లతో కొత్త కారు కొనుగోలు చేసిన కంగన

Kangana Ranaut bought new car

  • ధాకడ్ ప్రీమియర్ షోకి కొత్త కారులో వచ్చిన కంగన
  • కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన వైనం
  • మెర్సిడెస్ మేబ్యాక్ కారుతో ఫొటోలకు పోజులు

ఓ వైపు సినిమాలు, మరోవైపు వివాదాలతో సహవాసం చేసే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కొత్త కారు కొనుగోలు చేసింది. తను నటించిన ధాకడ్ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కంగన తన కొత్త కారుతో దర్శనమిచ్చింది. కంపెనీ ప్రతినిధులు ఆమెకు కారు తాళాలను అందజేశారు. కంగన కొనుగోలు చేసిన ఈ కారు ఖరీదు రూ.3.6 కోట్లు. ఇది మెర్సిడెస్ మేబాక్ ఎస్680 మోడల్ కారు. ధాకడ్ ప్రీమియర్ షోకి కంగన తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసింది. కొత్త కారుకు కంగన తల్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Kangana Ranaut
New Car
Mercedes Maybach
Bollywood

More Telugu News