RCB: చివరి మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలో దిగిన ఆర్సీబీ

RCB plays against Gujarat Titans do or die match
  • ముగింపు దశకు ఐపీఎల్
  • ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న బెంగళూరు, గుజరాత్
  • ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన గుజరాత్
  • ఈ మ్యాచ్ ఫలితంతో తేలనున్న బెంగళూరు భవితవ్యం
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 
ఐపీఎల్ తాజా సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నేడు తన చివరి లీగ్ మ్యాచ్ ఆడుతోంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగే ఈ పోరులో నెగ్గితేనే బెంగళూరు ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. 

నేటి మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడంతో ఆ జట్టుకు ఈ మ్యాచ్ లో ఓడిపోయినా ఫర్వాలేదు. బెంగళూరు ఓడిపోతే మాత్రం నాకౌట్ చేరే అవకాశాలు దాదాపుగా అడుగంటినట్టే. 

మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు 4 ఓవర్లు ముగిసే సరికి 1 వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 21 పరుగులు, మాథ్యూ వేడ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన ఓపెనర్ శుభ్ మాన్ గిల్... హేజెల్ వుడ్ బౌలింగ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
RCB
Gujarat Titans
Play Off
IPL

More Telugu News