Sunil Jakhar: బీజేపీలో చేరిన పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్

Punjab Ex PCC president Sunil Jakhar joins BJP

  • ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సునీల్ జాకర్
  • జేపీ నడ్డా సమక్షంలో ఈరోజు బీజేపీలో చేరిన వైనం
  • కాంగ్రెస్ తో 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నందుకు బాధగా ఉందన్న జాకర్

పంజాబ్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాకర్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు కాంగ్రెస్ నేతలు తనపై పార్టీ అధిష్ఠానానికి తప్పుడు సంకేతాలను పంపించారని... వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తనపై చర్యలు తీసుకుందని... అది తనను ఎంతో బాధించిందని చెప్పారు. రాహుల్ గాంధీ చాలా మంచి వ్యక్తి అని... అయితే భజనపరులను దూరం పెట్టి, ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని చెప్పారు.

Sunil Jakhar
BJP
Congress
  • Loading...

More Telugu News