Revanth Reddy: పేద రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ధనికులకు కూడా ఎందుకిస్తున్నారు?: రేవంత్ రెడ్డి

Sri Lanka situation will come to Telangana also says Revanth Reddy

  • ఏడేళ్లలో కేసీఆర్ రూ. 5 లక్షల అప్పులు చేశారన్న రేవంత్ 
  • ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని విమర్శ 
  • శ్రీలంక పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని వ్యాఖ్య 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. సంపన్నమైన తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన మండిపడ్డారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రూ. 69 వేల కోట్ల అప్పులు చేస్తే... ఏడేళ్లలో కేసీఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించారని అన్నారు.  

పేద రైతులకు ఇవ్వాల్సిన రైతుబంధును ధనికులకు కూడా ఎందుకిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే వరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రకటించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి 30 నెలల కాలంలోనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల రుణమాఫీని విడతల వారీగా వడ్డీతో సహా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రైతు విప్లవాలను కేసీఆర్ ధ్వంసం చేశారని మండిపడ్డారు. శ్రీలంక పరిస్థితి తెలంగాణలో కూడా వస్తుందని... శ్రీలంక అధ్యక్షుడిపై దాడి ఘటనలు తెలంగాణలో కూడా వస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News