Rajanikanth: సంక్రాంతి బరిలో అటు రజనీ .. ఇటు విజయ్!

Rajani 169 movie update

  • సెట్స్ పైకి వెళుతున్న రజనీ 169వ సినిమా 
  • ఆ దిశగా పనులు పూర్తిచేస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్
  • సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన
  • అదే సమయంలో రిలీజ్ అవుతున్న విజయ్ మూవీ   

ఒకప్పుడు రజనీకాంత్ సీనియర్ దర్శకులతోనే వరుస సినిమాలు చేసేవారు. అలాంటి ఆయన ఈ మధ్య కాలంలో యువ దర్శకులకి అవకాశాలిస్తూ వెళుతున్నారు. పా.రంజిత్ .. కార్తీక్ సుబ్బరాజు .. శివ వంటి దర్శకులతో సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన, తన తాజా చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు.
 
కెరియర్ పరంగా రజనీకి ఇది 169వ సినిమా. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 'బీస్ట్' ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా, నెల్సన్ విషయంలో సన్ పిక్చర్స్ వారు .. రజనీ వెనకడుగు వేయకపోవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుందని అంటున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ఇక విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి ఒక ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. తెలుగు ..  తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉంటుందనేది చూడాలి.

Rajanikanth
Nelson Dileep Kumar
Kollywood
  • Loading...

More Telugu News