YSRCP: ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న నలుగురు ప్రముఖుల బయోడేటాలు ఇవే

- నెల్లూరు జిల్లాకు చెందిన సాయిరెడ్డి, బీద మస్తాన్ రావులు
- తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు
- నలుగురికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలు
ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న నలుగురు ప్రముఖులను అధికార వైసీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 21న ఏపీ కోటాలోని 4 సీట్లు ఖాళీ కానుండగా..వాటిలో వీరు చేరిపోతారు. వైసీపీ ఎంపిక చేసిన వీరి పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
వేణుంబాక విజయసాయిరెడ్డి- వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్లమెంటులో ఆ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి...నెల్లూరు జిల్లాలోని తాళ్లరేవులో 1957 జూలై 1న జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు చార్టెర్డ్ అకౌంటెంట్‌గా చెన్నై కేంద్రంగా పనిచేసిన సాయిరెడ్డి.. సీఎం వైఎస్ జగన్ కంపెనీలకు ఆర్థిక సేవలందించేవారు.
ఈ క్రమంలోనే జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిన ఈయన.. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వైసీపీ పేరిట కొత్త పార్టీ పెట్టిన నాటి నుంచి సాయిరెడ్డి కూడా జగన్ వెంటే నడిచారు. అంతేకాకుండా వైసీపీ తరఫున తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా సాయిరెడ్డే దక్కించుకున్నారు. తాజాగా మరోమారు ఆయనను రాజ్యసభలో కొనసాగించేలా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.


టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 2014లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన ఆయన బీసీ ఉద్యమ నేతగానే కొనసాగుతున్నారు. తాజాగా రాజ్యసభ సీటుతో ఆయన వైసీపీలో కొనసాగనున్నారు.

