USA: హైప‌ర్‌ సోనిక్ వెప‌న్‌ ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన అమెరికా

US says it conducted a successful hypersonic weapon test

  • అధికారికంగా ప్రకటించిన అమెరికా 
  • బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబ‌ర్ ద్వారా ప్రయోగం
  • గ‌గ‌న‌త‌లం నుంచి అత్యంత వేగంగా దాడులు చేయ‌గ‌లిగే ఏజీఎం-183ఏ 
  • అది నిర్దేశిత‌ ల‌క్ష్యాన్ని ఛేదించింద‌ని అమెరికా ప్ర‌క‌టన

ధ్వ‌ని వేగం క‌న్నా 5 రెట్ల అధిక వేగంతో దూసుకెళ్లే హైప‌ర్ సోనిక్ మిస్సైల్ సిస్ట‌మ్ ను అమెరికా సైన్యం విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబ‌ర్ ద్వారా గ‌గ‌న‌త‌లం నుంచి అత్యంత వేగంగా దాడులు చేయ‌గ‌లిగే ఏజీఎం-183ఏ ను ప్ర‌యోగించ‌గా అది నిర్దేశిత‌ ల‌క్ష్యాన్ని ఛేదించింద‌ని అమెరికా ప్ర‌క‌టించింది. గ‌తంలో ఇందుకోసం మూడుసార్లు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అవి విఫ‌ల‌మ‌య్యాయి. తాజాగా ఈ ప్రోటోటైప్ ఆయుధాన్ని విజ‌య‌వంతంగా ప‌రీక్షించిన‌ట్లు అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. 

కాలిఫోర్నియాలోని ఎడ్వ‌ర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ వ‌ద్ద ఈ ప‌రీక్ష జ‌రిగిందని వివ‌రించింది. ఉక్రెయిన్ తో ర‌ష్యా యుద్ధం చేస్తోన్న స‌మ‌యంలో అమెరికా చేసిన ఈ హైప‌ర్ సోనిక్ మిస్సైల్ సిస్ట‌మ్ విజ‌య‌వంతం కావ‌డం గ‌మ‌నార్హం. ఉక్రెయిన్ లోని ప‌లు ప్రాంతాల్లో ఫిబ్ర‌వ‌రి 24 (యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి) నుంచి ర‌ష్యా ప‌లుసార్లు హైప‌ర్ సోనిక్ క్షిప‌ణుల‌తో దాడులు చేసింది. కింజ‌ల్ హైప‌ర్ సోనిక్ క్షిప‌ణుల‌ను కూడా ఒడెస్సాలో మోహ‌రించింది. ఈ క్షిప‌ణులు ధ్వ‌ని వేగం కంటే 10 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయ‌ని ర‌ష్యా చెప్పుకుంటోంది.

  • Loading...

More Telugu News