Bapatla District: బాప‌ట్ల జిల్లాలో మ‌హిళా వ‌లంటీర్ దారుణ హ‌త్య‌

lady valanteer murdered in bapatla district

  • చావ‌లి గ్రామంలో ఘ‌ట‌న‌
  • వ‌లంటీర్ శార‌ద‌ను హ‌త్య చేసిన ప‌ద్మారావు
  • వివాహేత‌ర బంధం నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగిన‌ట్టు పోలీసుల అనుమానం

ఏపీలోని బాప‌ట్ల జిల్లాలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. జిల్లా ప‌రిధిలోని వేమూరు మండ‌లం చావ‌లి గ్రామంలో వ‌లంటీర్‌గా ప‌నిచేస్తున్న శార‌ద అనే మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. గ్రామానికి చెందిన ప‌ద్మారావు అనే వ్య‌క్తి ఆమెను హ‌త్య చేశాడు. 

దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన గ్రామానికి చేరుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. వివాహేత‌ర సంబంధం నేప‌థ్యంలో త‌లెత్తిన గొడ‌వ కార‌ణంగానే శార‌ద‌ను ప‌ద్మారావు హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News