Amit Shah: మేం అధికారంలోకి వ‌చ్చాక‌...మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తాం: అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న‌

amith shah statement on minority reservations
  • బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సభలో అమిత్ షా ప్రసంగం  
  • తెలంగాణాలో మైనారిటీ రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని వెల్ల‌డి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను పెంచుతామ‌ని ప్ర‌క‌ట‌న‌
తెలంగాణ‌లో మైనారిటీల‌కు కేటాయించిన రిజ‌ర్వేష‌న్ల‌పై బీజేపీ అగ్రనేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో మైనారిటీల రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేస్తామ‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 

మైనారిటీ రిజ‌ర్వేష‌న్ల‌ను ర‌ద్దు చేసి... ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు శ‌నివారం తుక్కుగూడ‌లో జ‌రిగిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు స‌మావేశంలో అమిత్ షా రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.
Amit Shah
Telangana
BJP

More Telugu News