Mahesh Babu: నైజామ్ లో 'సర్కారువారి పాట' ఫస్టు డే వసూళ్లు!

Sarkaruvari paata movie update

  • నిన్న థియేటర్లకు వచ్చిన 'సర్కారువారి పాట'
  • అన్ని ప్రాంతాలలోను రికార్డు స్థాయి వసూళ్లు  
  • యాక్షన్ సీన్స్ కి ఎక్కువ మార్కులు 
  • వీకెండ్ తరువాత వసూళ్లపై అందరిలో ఆసక్తి

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'సర్కారువారి పాట' నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఒక్క నైజామ్ ఏరియాలోనే నిన్న ఈ సినిమా  12.24 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఒక రకంగా ఇవి చెప్పుకోదగిన వసూళ్లనే అంటున్నారు. 

టైటిల్ ను ఫిక్స్ చేసిన దగ్గర నుంచే ఈ సినిమాపై అందరిలో ఆసక్తి మొదలైంది. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ చూసిన తరువాత ఆత్రుత పెరుగుతూ వెళ్లింది. ఇక ఈ సినిమా నుంచి ఒక్కో సాంగ్ వదులుతూ వెళ్లడంతో అందరిలో అంచనాలు ఒక స్థాయికి చేరుకున్నాయి. ఊహించినట్టుగానే ఈ సినిమా థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించగలిగింది.

అక్కడక్కడా కొన్ని సీన్స్ ముందుగానే ఊహించినట్టుగా ఉన్నప్పటికీ, పరశురామ్ తన మార్కు చూపించగలిగాడు. మహేశ్ బాబు మార్కును దాటి కూడా వెళ్లలేదు. అలాగే కీర్తి సురేశ్ కూడా మహేశ్ ధాటిని తట్టుకుని నిలబడింది. వీకెండ్ లో ఈ సినిమా ఇదే జోరును కంటిన్యూ చేయవచ్చు. ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.

Mahesh Babu
Keerthy Suresh
Parashuram
Sarkaruvari paata Movie
  • Loading...

More Telugu News