Kakinada: కాకినాడ జిల్లాలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య

sarpavaram SI Gopala Krishna Committed suicide

  • సీఎం బందోబస్తుకు వెళ్లొచ్చిన ఎస్సై
  • ఈ తెల్లవారుజామున భార్యాపిల్లలు నిద్రిస్తుండగా ఆత్మహత్య
  • వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం
  • ఆరా తీస్తున్న పోలీసులు

కాకినాడ జిల్లా సర్పవరం ఎస్సై గోపాలకృష్ణ తన ఇంట్లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న సీఎం బందోబస్తుకు వెళ్లి వచ్చిన ఎస్సై.. ఈ తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడ సమీపంలోని జగ్గయ్య చెరువుకు చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో కాకినాడలో ట్రాఫిక్ విభాగంలో పనిచేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గోపాలకృష్ణ మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీ రవీంద్రనాథ్ బాబు జీజీహెచ్‌ను సందర్శించారు.

Kakinada
Sarpavaram
SI Gopala Krishna
Suicide
  • Loading...

More Telugu News