Paritala Sreeram: 'ఇదీ ఏపీ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల దుస్థితి' అంటూ ప‌రిటాల ట్వీట్

Paritala Sreeram tweet on ap government hospitals

  • ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వ‌రుస‌గా దారుణాలు
  • విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విప‌క్ష టీడీపీ
  • తాజాగా పరిటాల శ్రీరామ్ విమర్శలు  

ఏపీలో ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వ‌రుస‌గా వెలుగు చూస్తున్న దారుణాల‌పై విప‌క్ష టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. స‌ర్కారీ ఆసుప‌త్రుల‌ను అక్ర‌మాల‌కు అడ్డాగా మారుతోంటే ప్ర‌భుత్వం ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ యువ‌నేత ప‌రిటాల శ్రీరామ్ రాష్ట్రంలోని ఆసుప‌త్రుల దుస్థితిపై గురువారం నాడు ఓ ఘాటు ట్వీట్‌ను పోస్ట్ చేశారు. 

శవాలపై డబ్బులు ఏరుకునే అంబులెన్సు మాఫియా.. ఆరు బయట గర్భిణీలకు చికిత్స అందించే వైద్యులు... ఇప్పుడు ఏకంగా సెక్యూరిటీ గార్డులతో వైద్యం అందించి ప్రజల ప్రాణాలు తీసిన డాక్టర్లు...ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి అంటూ ప‌రిటాల శ్రీరామ్ త‌న ట్వీట్‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News