YSRCP: నెల్లూరు జిల్లాలో క్రిబ్కో ఇథనాల్ ప్లాంట్... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కారు
- రూ.560 కోట్ల పెట్టుబడి పెట్టనున్న క్రిబ్కో
- ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు
- ప్లాంట్‌కు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
నెల్లూరు జిల్లాలో కృషక్ భారతి కో ఆపరేటివ్ సొసైటీ (క్రిభ్కో) ఓ ఇథనాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.560 కోట్ల పెట్టుబడితో మొదలు కానున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు ప్లాంట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం కేబినెట్ భేటీకి ముందు సీఎం జగన్ నేతృత్వంలో స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశమైంది. నెల్లూరు జిల్లా పరిధిలోని సర్వేపల్లిలో 100 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు కానుంది.