Kangana Ranaut: నాపై రూమర్ల వల్లే పెళ్లి చేసుకోలేకపోయాను: కంగనా రనౌత్
![Kangana Ranaut says she is unable to get married because of rumours spread about her that she beats up boys](https://imgd.ap7am.com/thumbnail/cr-20220512tn627c9eea492b6.jpg)
- యాక్షన్ ఆధారిత ధాకడ్ లో నటించిన కంగనా
- నిజ జీవితంలో అలానే ఉంటారా..? అంటూ ఇంటర్వ్యూలో ప్రశ్న
- నేను ఎవరిని కొట్టానో చూపించండి? అంటూ ఎదురు ప్రశ్న
తన విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తుండడం వల్లే తాను వివాహం చేసుకోలేకపోయినట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఈ వదంతులే తనను సరైన జోడీని గుర్తించకుండా అడ్డుపడినట్టు ఆమె నవ్వుతూ చెప్పారు. కంగన నటించిన గూఢచార, యాక్షన్ ఆధారిత 'ధాకడ్' సినిమా త్వరలో విడుదల కానుండడం తెలిసిందే.
నిజ జీవితంలోనూ టామ్ బోయ్ మాదిరిగానే ఉంటారా? అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కంగనా రనౌత్ ఒక ప్రశ్న ఎదుర్కొంది. దీనికి ఆమె నవ్వుతూ.. ‘‘నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను? చూపించండి. మీ లాంటి వ్యక్తులు ఈ తరహా పుకార్లను వ్యాప్తి చేయడం వల్లే నేను పెళ్లి చేసుకోలేకపోయాను’’ అని ఆమె బదులిచ్చారు.
కఠినంగా ఉంటారన్న అభిప్రాయం వల్లే పెళ్లి చేసుకోలేకపోయారా? అని అడగ్గా.. 'అవును నేను అబ్బాయిలను కొడతానన్న పుకార్లు వ్యాపించడం వల్లే' అని ఆమె చెప్పారు.