Mahesh Babu: 'కళావతి' సాంగ్ పైనే నాకు డౌట్ ఉండేది: మహేశ్ బాబు

Mahesh Babu Interview

  • 'సర్కారువారి పాట' ప్రమోషన్స్ లో మహేశ్ 
  • 'కళావతి' పాట ముందుగా తనకు ఎక్కలేదని వెల్లడి  
  • పరశురామ్ గారు మరో డౌట్ పెట్టారన్న మహేశ్ 
  • ఆ క్రెడిట్ తమన్ దే అని చెప్పిన సూపర్ స్టార్ 

మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జోడీగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు థియేటర్లకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో మహేశ్ బాబు మాట్లాడుతూ .. "లాక్ డౌన్ సమయంలో తమన్ నాకు 'కళావతి' సాంగ్ ట్యూన్ ను  ఫోన్లో వినిపించాడు. ఆ పాట విన్న తరువాత  మెలోడీగా ఉంది .. కాకపోతే కాస్త స్లోగా అనిపిస్తోంది. ట్రాక్ కి ఎక్కడైనా ఎనర్జీ అవుతుందేమోనని అన్నాను. 

'లేదు బ్రదర్, నన్ను నమ్మండి .. ఈ పాట చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది .. ఎక్కడ  చూసినా ఈ పాటనే వినిపిస్తుంది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు. పరశురామ్ గారేమో .. 'మహేశ్ బాబు అంతటి పెద్ద హీరో కమాన్ .. కమాన్ కళావతి అంటే బాగుండదేమో' అని అన్నారు. 

'అలా ఏమీ ఉండదు .. నన్ను నమ్మండి బ్రదర్' అన్నాడు తమన్. ఆయన ఆ పాట విషయంలో ఫిక్స్ అయ్యాడు. ఆ తరువాత వినగా వినగా నాకు కూడా బాగానే నచ్చింది. ఈ రోజున ఈ పాటకి ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం తమన్ .. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది" అని చెప్పుకొచ్చారు. 

Mahesh Babu
Keerthi Suresh
Sarkaru Vaari Paata
  • Loading...

More Telugu News