Gujarat Titans: కొత్త జట్ల పోరులో పైచేయి ఎవరిదో... లక్నోపై టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

Gujarat Titans won the toss

  • పూణేలో సూపర్ జెయింట్స్ వర్సెస్ టైటాన్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టైటాన్స్
  • 8 విజయాలతో సమవుజ్జీలుగా ఉన్న రెండు జట్లు

ఐపీఎల్ కొత్త జట్లు లక్నో సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ నేడు కీలక సమరంలో తలపడుతున్నాయి. ఇరు జట్లు చెరో 11 మ్యాచ్ లు ఆడి ఎనిమిదేసి విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమించాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ బెర్తు అధికారికంగా ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఇక నేటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తోంది. 

కాగా, ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆడడంలేదని, అతడి స్థానంలో కరణ్ శర్మను తీసుకున్నామని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వెల్లడించాడు. అటు, గుజరాత్ టైటాన్స్ జట్టులో మూడు మార్పులు జరిగాయి. లాకీ ఫెర్గుసన్ స్థానంలో మాథ్యూ వేడ్, సాయి సుదర్శన్ స్థానంలో సాయి కిశోర్, ప్రదీప్ సాంగ్వాన్ స్థానంలో యశ్ దయాళ్ ఆడనున్నారు.

Gujarat Titans
Toss
Lucknow Supergiants
IPL
  • Loading...

More Telugu News