Google: కాల్ రికార్డింగ్ యాప్ లపై గూగుల్ నిషేధం... ఎప్పటి నుంచి అంటే...!

Google bans call recording apps

  • పలు స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ ఫీచర్
  • యూజర్ల ప్రైవసీకి నష్టదాయకం అని భావిస్తున్న గూగుల్
  • థర్డ్ పార్టీ యాప్ లపై వేటు
  • పలు కంపెనీల ఫోన్లలో ఇన్ బిల్ట్ గా కాల్ రికార్డింగ్ యాప్

స్మార్ట్ ఫోన్లలో కాల్ రికార్డింగ్ సదుపాయం ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే, ఈ కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగిస్తోందని గూగుల్ భావిస్తోంది. అందుకే ఆండ్రాయిడ్ ప్లాట్ ఫాంపై పనిచేసే థర్డ్ పార్టీ కాల్ రికార్డింగ్ యాప్ లను నిషేధిస్తోంది. ఈ నిషేధం మే 11 నుంచి అమలు కానుంది. 

ఇకపై ఆయా కాల్ రికార్డింగ్ యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించవు. ఇకపై యాప్ డెవలపర్లు ఆండ్రాయిడ్ ఫోన్లకు సంబంధించి కాల్ రికార్డింగ్ ఏపీఐ యాక్సెస్ పొందడం కుదరదని, అయితే శాంసంగ్, వివో, రెడ్ మీ తదితర పేరెన్నికగన్న కంపెనీల ఫోన్లలో కాల్ రికార్డింగ్ యాప్ లు ఇన్ బిల్ట్ గా వస్తాయి. ఈ ఫోన్లకు సంబంధించి గూగుల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Google
Call Recording
Apps
Play Store
Smrtphone
  • Loading...

More Telugu News