TDP: వార్డుమెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌ని నికృష్ట చ‌రిత్ర నీది!.. విజ‌య‌సాయిరెడ్డిపై అయ్య‌న్న‌పాత్రుడి సెటైర్‌!

ayyannapatrudu satires on vijay sai reddy

  • క్విడ్ ప్రోకో జాతి పిత అంటూ సాయిరెడ్డిపై అయ్య‌న్న‌ విమ‌ర్శ‌
  • సూట్‌కేసు కంపెనీల సృష్టిక‌ర్త‌గానూ అభివ‌ర్ణ‌న‌
  • గ‌డ్డం నెరిసినా స‌ర‌సం పోలేద‌ని టీడీపీ నేత చుర‌క‌

విప‌క్ష టీడీపీపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విరుచుకుప‌డుతున్న రీతిలోనే ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా ఆయ‌నపై విరుచుకుప‌డుతున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం నాడు ట్విట్ట‌ర్ వేదిక‌గా టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు... విజ‌య‌సాయిరెడ్డిపై ఘాటు వ్యాఖ్య‌ల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. 

విజ‌య‌సాయిరెడ్దిని క్విడ్‌ప్రోకో జాతిపిత‌గా, సూట్‌కేసు కంపెనీల సృష్టి క‌ర్తగా అభివ‌ర్ణించిన అయ్య‌న్న‌... పెద్ద పెద్ద స‌వాళ్లు విసురుతున్నావంటూ విమ‌ర్శించారు. వార్డుమెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌ని నికృష్ణ చ‌రిత్ర నీది అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. `గ‌డ్డం` నెరిసినా సింగిల్‌-మింగిల్ అంటూ ఆ స‌ర‌సం పోలేదని ఎద్దేవా చేసిన అయ్య‌న్న‌... మీ జాతిర‌త్నం సింగిల్‌గా సింహంలా వచ్చేవాడైతే ఎందుకీ ప‌ర‌దాలు, వల‌లు, ప‌ర్య‌టించే ప్రాంతంలో 144 సెక్ష‌న్లు, షాపుల మూసివేత‌లు అంటూ ధ్వ‌జ‌మెత్తారు.

More Telugu News