Bosu Babu: సినీ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి

Tollywood producer Kodali Bosu Babu passes away

  • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన బోసుబాబు
  • ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో చిత్రాలు నిర్మించిన సీనియర్ నిర్మాత
  • ఆయన వయసు 66 సంవత్సరాలు

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందారు. గుండెపోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. దివంగత దాసరి నారాయణరావుకు ఆయన బంధువు అవుతారు. దాసరి భార్య దివంగత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. 

తొలుత దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన బోసుబాబు... ఆ తర్వాత దాసరి ఆశీస్సులతోనే నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' సినిమాలను నిర్మించారు. బోసుబాబుకు భార్య, నలుగులు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Bosu Babu
Tollywood
Producer
Dead
  • Loading...

More Telugu News