Ntr: ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ లాంచ్ ఆ రోజునే!

Ntr in Prashanth Neel Movie

  • 'ఆర్ ఆర్ ఆర్'తో హిట్టు కొట్టిన ఎన్టీఆర్ 
  • కొరటాలతో రెండో సినిమాకి తయారు
  • త్వరలో పట్టాలెక్కుతున్న ప్రాజెక్టు
  • ప్రశాంత్ నీల్ తో సినిమా దసరాకి లాంచ్

'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్, ఆ తరువాత సినిమాను కొరటాలతో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన ప్రశాంత్ నీల్ తో చేయనున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సలార్' సినిమాను చేస్తున్న ప్రశాంత్ నీల్, మరోసారి మాస్ యాక్షన్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కి ఒక లైన్ వినిపించి ఓకే అనిపించుకున్న ఆయన, ఈ ప్రాజెక్టును 'దసరా' రోజున లాంచ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయనున్న ఈ సినిమా ఏ జోనర్లో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక పేరు వినిపిస్తోంది. ఇప్పటికే 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాను  2024 దసరాకి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

Ntr
Rashmika Mandanna
Prashanth Neel Movie
  • Loading...

More Telugu News