Rahul Gandhi: ఇప్పటి ధరతో అప్పట్లో రెండు సిలిండర్లు వచ్చేవి.. కేంద్రంపై రాహుల్ మండిపాటు

Rahul Pot Shots On Central Govt Over Gas Price Hikes

  • గ్యాస్ ధరలు పెంచడంపై ఆగ్రహం
  • అప్పట్లో ఒక్క గ్యాస్ సిలిండర్ ధర రూ.410 అని వెల్లడి
  • ఇప్పుడు రెండింతలయ్యాయన్న కాంగ్రెస్ నేత

గ్యాస్ ధరలు పెంచేసి మరోసారి సామాన్యుడి నడ్డి విరిచేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంతో పోలిస్తే గ్యాస్ ధరలు రెండింతలయ్యాయని ఆయన విమర్శించారు. 

‘‘ఇప్పుడున్న గ్యాస్ ధరతో 2014లో రెండు సిలిండర్లు వచ్చేవి. 2014లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క గ్యాస్ సిలిండర్ ధర రూ.410. సబ్సిడీగా రూ.827 ఇచ్చేవాళ్లం. కానీ, ఇప్పుడు గ్యాస్ ధర రూ.వెయ్యి అయింది. సబ్సిడీ సున్నా వస్తోంది’’ అంటూ ఫైర్ అయ్యారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, అదే మన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News