Chris Gayle: ఐపీఎల్ లో నాకు తగిన గౌరవం దక్కలేదు: క్రిస్ గేల్

Chris Gayle complains on IPL

  • ఈ సీజన్ లో కనిపించని గేల్
  • గత సీజన్ మధ్యలోనే తప్పుకున్న విండీస్ యోధుడు
  • రెండేళ్లుగా తన పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని వెల్లడి

ఐపీఎల్ దిగ్గజాల్లో ఒకరిగా గుర్తింపు పొందిన విండీస్ వీరుడు క్రిస్ గేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో తనకు సముచిత గౌరవం లభించలేదని ఆరోపించాడు.  ఐపీఎల్ లో  ఘనమైన రికార్డులున్న గేల్ ఈ ఏడాది వేలంలో పాల్గొనలేదు. గత సీజన్ లో మధ్యలోనే తప్పుకున్నాడు. సుదీర్ఘకాలం పాటు బయోబబుల్ లో గడపలేక గేల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. 

తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ఐపీఎల్ లో తన పట్ల వ్యవహరించిన తీరు సరిగా లేదని అన్నాడు. ఐపీఎల్ లో ఎన్నో ఘనతలు సాధించిన తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం బాధ కలిగించిందని, అయితే, క్రికెట్ తర్వాత కూడా జీవితం ఉందన్న సత్యాన్ని గుర్తెరిగి ఇంతకుమించి పట్టించుకోదలచుకోలేదని వెల్లడించాడు. ఎవర్నీ ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక వేలంలోనూ పాల్గొనలేదని గేల్ స్పష్టం చేశాడు. 

ఐపీఎల్ లో గేల్ 6 సెంచరీలు సాధించడం విశేషం. మరే ఆటగాడు ఐపీఎల్ లో ఇన్ని సెంచరీలు కొట్టలేదు. అంతేకాదు, 142 మ్యాచ్ లు ఆడిన గేల్ 4,965 పరుగులు చేసి ఐపీఎల్ ఆల్ టైట్ గ్రేట్స్ లో ఒకడిగా నిలిచాడు.

Chris Gayle
IPL
Respect
Auction
West Indies
  • Loading...

More Telugu News