Cricket: ‘బ్యాట్ డాక్టర్’ బర్త్ డే సెలబ్రేట్ చేసిన ధోనీ.. గుండెలకు హత్తుకునే వీడియో ఇదిగో

Dhoni Celebrates Sharavanan anna Birth Day

  • ‘రా.. శరవణన్ అన్నా’ అంటూ దగ్గరకెళ్లిన ధోనీ
  • కేక్ కట్ చేసి తినిపించిన చెన్నై సారథి
  • అనంతరం జట్టు సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ తో ఫొటో షూట్

ఏ కొద్ది అవకాశం దొరికినా జట్టు సభ్యులతోనే కాదు.. సపోర్టింగ్ స్టాఫ్ తోనూ టీమిండియా మాజీ సారథి, ఐపీఎల్ లో చెన్నై ప్రస్తుత సారథి మహేంద్ర సింగ్ ధోనీ ఆత్మీయంగా ఉంటాడు. నిన్న కూడా చెన్నై సపోర్టింగ్ స్టాఫ్ పుట్టిన రోజును మైదానంలో సెలబ్రేట్ చేసి అతడికి గుర్తుండిపోయేలా చేశాడు. 

‘రా.. శరవణన్ అన్నా’ అంటూ పలకరించి.. కేక్ కట్ చేయించి తినిపించాడు. ‘బ్యాట్ డాక్టర్’గా పిలిచే అతడి పుట్టిన రోజును ధోనీతో పాటు జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ గుర్తుండిపోయేలా చేశారు. అంతేకాదండోయ్.. అంత బిజీ షెడ్యూల్ లోనూ ఆటవిడుపుగా ఫొటో షూట్ కూడా చేశారు. 

కాగా, న్యూజిలాండ్ బ్యాటర్ డేవాన్ కాన్వే తనకు ‘బ్యాట్ డాక్టర్’ అంటూ పేరు పెట్టాడని శరవణన్ చెప్పాడు. నిస్వార్థంగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని, అదే అసలైన ఆనందాన్ని పంచుతుందని తెలిపాడు. కాగా, చెన్నై కెప్టెన్ గా జడేజా నుంచి ధోనీ మళ్లీ పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News