Power Holidays: నాడు హాలిడేస్‌, నేడు హ్యాపీడేస్‌.. విద్యుత్ కోత‌ల‌పై టీఆర్ఎస్ ఇంట‌రెస్టింగ్ ట్వీట్‌

trs interesting tweeton power supply situation in telanagana

  • స‌మైక్య రాష్ట్రంలో ప‌వ‌ర్ హాలీడేలు
  • ప్ర‌త్యేక తెలంగాణ‌లో కోత‌లు లేని విద్యుత్ స‌ర‌ఫ‌రా
  • పారిశ్రామిక ప్ర‌గ‌తి ప‌థంలో తెలంగాణ అన్న టీఆర్ఎస్‌

దేశంలో కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారిన విద్యుత్ కోత‌ల‌పై తెలంగాణలోని అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) శుక్ర‌వారం నాడు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేసింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కొర‌త నేప‌థ్యంలో కోత‌ల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌ల‌కు ప‌వ‌ర్ హాలిడేస్ ప్ర‌క‌టిస్తున్న వైనాన్ని ఆ పోస్టులో ప్ర‌స్తావించింది. తెలంగాణ స‌మైక్య రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేది? ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక ఇప్పుడు తెలంగాణ‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌రిస్థితి ఏమిట‌న్న దానిని కూడా ప్ర‌స్తావిస్తూ టీఆర్ఎస్ ఆ ట్వీట్‌ను ఆస‌క్తికరంగా పోస్ట్ చేసింది.

నాడు స‌మైక్య రాష్ట్రంలో ఉన్న తెలంగాణ‌లో ప‌వ‌ర్ హాలిడేస్ కార‌ణంగా ప‌రిశ్ర‌మ‌ల‌కు తాళాలు ప‌డ్డాయ‌ని టీఆర్ఎస్ ప్ర‌స్తావించింది. అయితే నేడు సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో నిరంత‌ర క‌రెంటుతో తెలంగాణ‌ పారిశ్రామిక ప్ర‌గ‌తి ప‌థంలో ముందుకు సాగుతోంద‌ని వెల్ల‌డించింది. అందుకే తెలంగాణ‌లో ఇప్పుడంతా హ్యాపీడేసేన‌న్న‌ట్లుగా టీఆర్ఎస్ ఆ ట్వీట్‌ను సంధించింది.

More Telugu News