Varla Ramaiah: బాలినేని ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే మాత్రమే: వర్ల రామయ్య

Balineni is now only MLA says Varla Ramaiah

  • మంత్రి పదవి పోయినా బాలినేనికి పొగరు తగ్గలేదన్న రామయ్య 
  • హోం మంత్రి వనిత వేరే శాఖను తీసుకోవాలని సలహా 
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు లేనే లేవని కామెంట్ 

వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి టీడీపీ నేత వర్ల రామయ్య వార్నింగ్ ఇచ్చారు. దళిత మహిళల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు. మంత్రి పదవి పోయినా బాలినేనికి పొగరు తగ్గలేదని మండిపడ్డారు. బాలినేని ఇప్పుడు ఆఫ్ట్రాల్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని ఎద్దేవా చేశారు. 

హోంమంత్రి పదవికి తానేటి వనిత పనికిరారని... ఆమె వేరే శాఖను తీసుకోవాలని రామయ్య సూచించారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో వర్ల రామయ్య పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేనే లేవని వర్ల మండిపడ్డారు. మహిళలు పట్టపగలు కూడా తిరగలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అవగాహన లేని వ్యక్తి సీఎం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. శాంతిభద్రతలు లేని కారణంగానే రేపల్లె లాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ముద్దాయిలతో రాష్ట్ర ప్రభుత్వం స్నేహంగా ఉంటోందని విమర్శించారు. మూడు మానభంగాలు, ఆరు హత్యలతో రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారయిందని చెప్పారు.

Varla Ramaiah
Telugudesam
Balineni Srinivasa Reddy
Jagan
Taneti Vanita
YSRCP
  • Loading...

More Telugu News