India: దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. రాజీవ్ గాంధీ లా యూనివర్శిటీలో కరోనా కల్లోలం!

India corona updates

  • గత 24 గంటల్లో 3,275 కరోనా కేసుల నమోదు
  • దేశ వ్యాప్తంగా 55 మంది మృతి
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,719

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 4.23 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 3,275 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటిలో ఢిల్లీలో అత్యధికంగా 1,354 కేసులు నమోదయ్యాయి. నిన్న 3,010 మంది కరోనా నుంచి కోలుకోగా... 55 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 19,719 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4.30 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా... 5.23 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 

మరోవైపు పంజాబ్ లోని రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లా లో కరోనా కల్లోలం సృష్టించింది. యూనివర్శిటీలోని 60 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో యూనివర్శిటీ మొత్తాన్ని అధికారులు కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. మరోవైపు మద్రాస్ ఐఐటీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 170కి చేరుకుంది.

More Telugu News