Adivi Sesh: 'మేజర్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు!

Major movie update

  • 'మేజర్'గా కనిపించనున్న అడివి శేష్
  • యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా ఇది
  • నిర్మాతగా మహేశ్ వ్యవహరించడం విశేషం
  • కథానాయికగా సయీ మంజ్రేకర్ కి ఇది రెండో సినిమా

అడివి శేష్ హీరోగా .. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' సినిమా రూపొందింది. మహేశ్ బాబు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ముంబైలోని ఒక హోటల్ పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో నడిచే కథ ఇది. 

ఈ సినిమా విడుదలకు సరైన డేట్ కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ .. మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక ప్రోమో కట్ వదిలారు. 

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో కథానాయికగా సయీ మంజ్రేకర్ .. ముఖ్యమైన పాత్రలో శోభిత ధూళిపాళ కనిపించనున్నారు. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ కీలకమైన పాత్రలను పోషించారు. చాలా కాలం తరువాత ఒక ప్రత్యేకమైన పాత్రలో రేవతి కనిపించనుండటం విశేషం.

Adivi Sesh
Saiee Manjrekar
Major Movie

More Telugu News