Pavan kalyan: 'వీరమల్లు' విషయంలో లేటెస్ట్ టాక్ ఇదే!

Veeramallu movie update

  • 'వీరమల్లు' విషయంలో జరుగుతున్న ఆలస్యం 
  • ఏకధాటిగా షూటింగు జరపాలనేదే క్రిష్ ఆలోచన
  • ఆ దిశగానే కష్టపడుతున్న పవన్ కల్యాణ్ 
  • వీలైతే దసరాకి ..  లేదంటే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం

పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్లో 'హరి హర వీరమల్లు' సినిమా, సెట్స్ పైకి వెళ్లి చాలాకాలమే అవుతుంది. కరోనా కారణంగా కొన్నాళ్లు .. ముందుగా 'భీమ్లా నాయక్'ను పూర్తి చేయాలనే పవన్ నిర్ణయం కారణంగా కొన్నాళ్లు 'వీరమల్లు' షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. రీసెంట్ గా మళ్లీ ఈ సినిమా షూటింగు మొదలైంది. 
 
ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, మిగతా 50 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోవలసి ఉంది. ఈ సినిమా కోసం భారీ సెట్లను వేయించారు. కొన్ని మైదానాలను సిద్ధం చేశారు. ఈ లొకేషన్లలో నాన్ స్టాప్ గా షూటింగును పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి. 

అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ 'దసరా'కి .. లేదంటే 'సంక్రాంతి'కి రిలీజ్ చేయాలనే ఒక నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. పవన్ సరసన నాయికగా నిధి అగర్వాల్ అందాల సందడి చేయనుంది. అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

Pavan kalyan
Nidhi Adarwal
Hari Hara Veeramallu
  • Loading...

More Telugu News