Dead Bodies: రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం బ్రిడ్జి వద్ద రెండు మృతదేహాల లభ్యం

 Two dead bodies found near Kothagudem bridge in Rangareddy district

  • చెట్ల మధ్య నగ్నంగా పడి ఉన్న మృతదేహాలు
  • మృతులను యశ్వంత్, జ్యోతిగా గుర్తింపు
  • వీరిని హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
  • వివాహేతర సంబంధమే కారణమని అంచనా

రంగారెడ్డి జిల్లాలో ఓ బ్రిడ్జి వద్ద ఓ యువతి, యువకుడి మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. కొత్తగూడెం బ్రిడ్జి వద్ద ఈ మృతదేహాలు కుళ్లినస్థితిలో కనిపించాయి. మృతులను వారాసిగూడకు చెందిన యశ్వంత్ (22), జ్యోతి (28)గా గుర్తించారు. ఘటన స్థలికి సమీపంలోనే వారికి చెందిన ద్విచక్రవాహనం, బ్యాగ్ ఉన్నాయి.

కాగా, యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసిన దుండగులు, యువతి ముఖాన్ని కూడా రాయితో చితక్కొట్టినట్టు ఘటన స్థలం వద్ద దృశ్యాలు చెబుతున్నాయి. ఇద్దరి మృతదేహాలు అక్కడి చెట్ల మధ్య నగ్నంగా పడి ఉన్నాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని అంచనా వేశారు. 

సికింద్రాబాద్ లో యశ్వంత్ ఓ కారు డ్రైవరుగా పనిచేస్తుండగా, జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి హంతకులు ఎవరన్నది కనుగొంటామని పోలీసులు వెల్లడించారు.

దీనిపై డీసీపీ షీన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, జ్యోతి భర్తను విచారిస్తున్నామని చెప్పారు. అటు, యశ్వంత్ సోదరుడు స్పందించారు. ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటినుంచి బయటికి వెళ్లాడని తెలిపారు. ద్విచక్రవాహనం నెంబరు ఆధారంగా పోలీసులు తమకు ఫోన్ చేశారని వెల్లడించారు.

More Telugu News