Aamir Khan: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరాకు ‘ఏడుపు రోగం’.. ఇన్ స్టాగ్రామ్ లో ఐరా ఆవేదన

Aamir Khan Daughter Has A strange Disease

  • ఇంత పొడవున భావోద్వేగ వ్యాఖ్యలు
  • ఏదో జరిగిపోతున్నట్టుగా అనిపిస్తోంది
  • నిద్ర పట్టదు.. ఆ యాంగ్జైటీ వదిలి చావదు
  • అసలేంటో అంతుపట్టట్లేదని విచారం

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ఓ మాయదారి వ్యాధితో బాధపడుతోందట. ‘ఏడుపు రోగం’ పట్టి పీడిస్తోందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లో ఇవాళ తనకున్న వ్యాధి గురించి అభిమానులతో పంచుకుంది. పొడవాటి ఎమోషనల్ నోట్ ను విడుదల చేసింది. ఇదీ ఆమె చెప్పుకొన్న ఆవేదన...

‘‘నా మీద యాంగ్జైటీ దాడి చేస్తోంది. గతంలో ఎప్పుడూ నాకు యాంగ్జైటీ లేదు.. కానీ, ఇప్పుడు పట్టుకుంది. దాని వల్ల చాలా ఉద్వేగానికి లోనవుతున్నా. ఏడుపు రోగం (క్రయింగ్ ఫిట్స్) పట్టి చంపేస్తోంది. భయానికి, భయం దాడికి మధ్య తేడా ఉన్నట్టే యాంగ్జైటీకి యాంగ్జైటీ ఎటాక్ కు మధ్య కూడా చిన్న తేడా ఉంది. 

యాంగ్జైటీ ఎటాక్స్ తో బాహ్య లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. సవ్యంగా లేని హృదయ స్పందనలు, ఊపిరితీసుకోలేకపోవడం, ఏడుపు.. ఇవి యాంగ్జైటీ ఎటాక్స్ లక్షణాలు. అవి చాలా నెమ్మదినెమ్మదిగా వస్తుంటాయి. పెరిగి పెద్దవుతాయి. ఏదో జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. 

నాకూ అలాంటి సమస్యే వచ్చింది. అయితే, పానిక్ ఎటాక్ ఎలా ఉంటుందో మాత్రం నాకు తెలియదు. 2 నెలలకోసారి దీనికి గురయ్యే నేను.. ఇప్పుడు ప్రతిరోజూ దాని బారిన పడుతున్నా. తరచూ వస్తే కచ్చితంగా మానసిక నిపుణుడి వద్దకు వెళ్లాల్సిందేనని డాక్టర్ చెప్పారు. ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే నా మాటలు కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. 

నాకైతే అస్సలు ఏ మాత్రం అంతుపట్టడం లేదు. ఎందుకంటే నిద్రపోదామంటే.. నిద్ర అస్సలు పట్టిచావదు. ఆ యాంగ్జైటీ ఎటాక్ వదిలి చావదు. నా భయాలేంటో గుర్తించే పనిచేసినా ఉపయోగం లేదు. నాతో నేను మాట్లాడేసుకుంటున్నా. ఒకసారి అది ఎటాక్ చేసిందా.. దాని నుంచి తప్పించుకునే మార్గమే లేదు. 

ఇది డెవలప్ అయ్యేటప్పుడే సమస్యను అడ్రస్ చేస్తే పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. అద్దంలో మనల్ని మనం చూసి మాట్లాడుకోవడం, ఊపిరి తీసుకోవడం వంటి వాటి వల్ల సమస్యను దూరం చేసుకునే అవకాశం ఉంది. కనీసం కొన్ని గంటలైనా అది మన దగ్గరకు రాకుండా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వచ్చే అవకాశమూ ఉంటుంది. జీవితం అంటేనే రకరకాలు’’ అని ఐరా పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News