Poco M4 5G: పోకో ఎం4 5జీ.. చౌక 5జీ స్మార్ట్ ఫోన్

Poco M4 5G launched in India

  • ఆరంభ వెర్షన్ ధర రూ.12,999. 
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్ సెట్
  • 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్
  • ఐపీ52 రేటింగ్

బడ్జెట్ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్ ను షావోమీ తీసుకొచ్చింది. పోకో ఎం4 5జీ పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్ వోసీ చిప్ సెట్ ఉంటుంది. నీటి బిందువులు ఫోన్ పై పడినా ఏమీ కాకుండా రక్షణ (ఐపీ52 రేటింగ్) ఉంది.  

6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ డిస్ ప్లే, ఫుల్ హెడ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో స్క్రీన్ కు రక్షణ ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. అయినా కానీ, కంపెనీ 22.5 వాట్ ఫాస్ట్ చార్జర్ ను బాక్స్ లో అందిస్తోంది. 

వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయి. డిజైన్ కూడా వెనుక భాగంలో పోకో బ్రాండింగ్ తో భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు రకాల వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. 6జీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999. కూల్ బ్లూ, పవర్ బ్లాక్, పోకో ఎల్లో రంగుల్లో లభిస్తుంది.

Poco M4 5G
launched
Poco M4 5G launched in India: Price
key features
  • Loading...

More Telugu News