OnePlus: 17 నిమిషాల్లోనే చార్జింగ్ ఫుల్.. వన్ ప్లస్ 10ఆర్ విడుదల
- 150 వాట్ చార్జింగ్ తో ఒక్కటే వేరియంట్
- 80 వాట్ చార్జింగ్ తో రెండు వేరియంట్లు
- వీటి ధరలు రూ.38,999- 43,999
- మే 4 నుంచి దేశవ్యాప్తంగా విక్రయాలు
ఎన్నో రోజులుగా ఊరిస్తున్న వన్ ప్లస్ 10 ఆర్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ ను చాలా వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. 100 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇందుకోసం 150 వాట్ సూపర్ వూక్ చార్జర్ ను కంపెనీ అందిస్తోంది. దేశంలోనే అత్యంత వేగంగా చార్జ్ చేసే ఫోన్ ఇదే. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ 10 నిమిషాల్లో 70 శాతం చార్జ్ అవుతుంది. ఇక 80 వాట్ సూపర్ వూక్ చార్జర్ సపోర్ట్ చేసే వన్ ప్లస్ 10 ఆర్ వేరియంట్ ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ లో గేమింగ్ పనితీరు.. డైమెన్సిటీ 8000తో పోలిస్తే 20 శాతం మెరుగ్గా ఉంటుందని సంస్థ చెబుతోంది.
6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, పంచ్ హోల్ కటవుట్ తో ఉంటుంది. 120 గిగాహెర్జ్ రీఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సల్ సోనీ ఐఎంఎక్స్ 766 ప్రధాన సెన్సార్. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ 12.1తో ఆడ్రాయిడ్ 12పై ఇవి పనిచేస్తాయి. మూడు ఆండ్రాయిడ్ వెర్షన్ల వరకు అప్ గ్రేడ్ కావచ్చు.
వన్ ప్లస్ 10 ఆర్ 150 వాట్ సూపర్ వూక్ తో కూడిన వేరియంట్ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ.43,999. ఇక 80 వాట్ సూపర్ వూక్ తో ఉండే 8జీబీ, 128జీబీ ధర రూ.38,999. 12జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ.42,999. అమెజాన్, వన్ ప్లస్, రిటైల్ స్టోర్లలో మే 4 నుంచి విక్రయాలు మొదలవుతాయి.