Mobile theatre: రాజమండ్రిలో మొబైల్ థియేటర్...తొలి చిత్రంగా ఆచార్య ప్రదర్శన
![Mobile theatre Opening in Rajahmundry tomorrow](https://imgd.ap7am.com/thumbnail/cr-20220428tn626ab5d8cd714.jpg)
- 120 సీట్లతో మొబైల్ థియేటర్ సిద్ధం
- రేపు రాజమండ్రిలో ప్రారంభం కానున్న మొబైల్ థియేటర్
- ఏసీ సౌకర్యం కూడా అందుబాటులో ఉన్న వైనం
సినిమా ప్రదర్శనలో ఎప్పటికప్పుడు కొత్త తరహా అనుభూతులు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. సినిమా వీక్షణను మరింత ఉల్లాసభరితంగా చేసే దిశగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా తాజాగా మొబైల్ థియేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఓ వాహనాన్ని సినిమా థియేటర్‌గా మార్చేసి... దానిని ఎక్కడికంటే అక్కడకు తరలించేలా ఏర్పాట్లు చేసిన కొత్త తరహా థియేటర్‌నే ఇప్పుడు మొబైల్ థియేటర్‌గా పిలుస్తున్నారు.
ఇలాంటి థియేటర్ ఒకటి ఏపీలోని రాజమహేంద్రవరం ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆచార్య సినిమాను ఈ థియేటర్‌లో తొలుత ప్రదర్శించనున్నారు. ఆచార్య సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్భంగా ఈ మొబైల్ థియేటర్ రేపు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఏసీ సౌకర్యం కలిగిన ఈ మొబైల్ థియేటర్‌లో 120 సీట్లు ఉన్నాయి.