Delhi Capitals: కోల్ కతాపై టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్... కరోనా నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన మార్ష్

Delhi Capitals won the toss

  • వాంఖెడే స్టేడియంలో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు 
  • ఇరు జట్లకు విజయం కీలకం

ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ నేడు తలపడుతున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా కరోనా నుంచి కోలుకున్న ఢిల్లీ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. 

చేతన్ సకారియా కూడా ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఖలీల్ అహ్మద్, సర్ఫరాజ్ ఖాన్ లను పక్కనబెట్టారు. అటు, కోల్ కతా జట్టులో మూడు మార్పులు చేసినట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెల్లడించాడు. ఆరోన్ ఫించ్, హర్షిత్ రాణా, ఇంద్రజిత్ జట్టులోకి వచ్చారు.

Delhi Capitals
Toss
KKR
Mitchell Marsh
IPL
  • Loading...

More Telugu News