Pakistan: ఖుషీ మూవీకి 21 ఏళ్లు... మధుర స్మృతులను నెమరువేసుకున్న భూమిక
![Bhumika tweet on 21 YEARS OF KUSHI](https://imgd.ap7am.com/thumbnail/cr-20220426tn62681c1eb7ccf.jpg)
- మధుగా ఖుషీలో కనిపించిన భూమిక
- ఆ పాత్ర తనకు మంచి గుర్తింపు నిచ్చిందన్న నటి
- చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భూమిక ట్వీట్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు మరపురాని విజయాన్ని అందించిన ఖుషీ చిత్రానికి మంగళవారంతో సరిగ్గా 21 ఏళ్లు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా భూమిక చావ్లా నటించింది. ఈ చిత్రం అటు పవన్ కల్యాణ్‌తో పాటు ఇటు భూమిక చావ్లాకు కూడా మంచి గుర్తింపును ఇచ్చింది. అప్పటికే పలు చిత్రాల్లో పవన్ నటించగా...భూమికకు మాత్రం ఖుషీ రెండో చిత్రమే. రెండో చిత్రంగా తనకు అందిన ఖుషీతో భూమిక తెలుగు సినీ ఇండస్ట్రీలో నిలబడిపోయింది.
ఖుషీ చిత్రానికి 21 ఏళ్లు నిండిన సందర్భంగా భూమిక ఆ చిత్రంలో తన నటన, చిత్ర బృందంతో తనకు దక్కిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ మంగళవారం రాత్రి ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ఈ సినిమాలో మధుగా తనకు దక్కిన గుర్తింపును ప్రధానంగా ప్రస్తావించింది. తనకు జోడీగా నటించిన పవన్‌తో పాటు చిత్ర దర్శకుడు ఎస్‌జే సూర్య, నిర్మాత ఏఎం రత్నంలకు ప్రత్యేకంగా ఆమె కృతజ్ఞతలు తెలిపింది.