Taneti Vanita: టీడీపీ హయాంలో దారుణాలు బయటికి వచ్చేవి కావు... మాపై నమ్మకంతో బాధితులు బయటికి వస్తున్నారు: హోంమంత్రి వనిత

Home Minister Taneti Vanitha slams TDP leaders

  • విజయవాడలో అత్యాచార ఘటన
  • టీడీపీ నేతలపై మండిపడిన తానేటి వనిత
  • బాధితురాలి పరామర్శను కూడా రాజకీయం చేశారని ఆగ్రహం
  • బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించామన్న మంత్రి 

టీడీపీ నేతలకు మహిళలంటే గౌరవం లేదని ఏపీ హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా రాజకీయం చేశారని విమర్శించారు. విజయవాడ అత్యాచారం కేసులో నిందితులను మూడు గంటల్లోనే పట్టుకున్నామని వనిత స్పష్టం చేశారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం కూడా ఇచ్చామని వెల్లడించారు. టీడీపీ హయాంలో దారుణాలు బయటికి వచ్చేవి కావని, కానీ తమ ప్రభుత్వంపై నమ్మకంతో బాధితులు బయటికి వస్తున్నారని మంత్రి తానేటి వనిత వివరించారు. దిశ యాప్ ద్వారా 900 మందిని రక్షించగలిగామని చెప్పారు.

Taneti Vanita
Home MInister
TDP
Vijayawada
  • Loading...

More Telugu News