Virat Kohli: రాజస్థాన్ పై టాస్ గెలిచిన బెంగళూరు... అందరి దృష్టి కోహ్లీపైనే!

All eyes on Virat Kohli

  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • గత రెండు మ్యాచ్ లలో కోహ్లీ డకౌట్
  • పట్టుదలతో ఉన్న కోహ్లీ
  • ఈ మ్యాచ్ లో ఎలా ఆడతాడన్న దానిపై సర్వత్ర ఆసక్తి

ఐపీఎల్ లో నేడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ లో అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉండనుంది. గత రెండు మ్యాచ్ లలో తానాడిన తొలి బంతికే కోహ్లీ అవుటయ్యాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో అయితే కోహ్లీ ఎంతో అవమానకర రీతిలో మైదానాన్ని వీడాడు. 

ఈ నేపథ్యంలో, నేడు ఎలా ఆడతాడన్న దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. కోహ్లీ వంటి ఆటగాడిలో నైపుణ్యాన్ని తక్కువ అంచనా వేయలేమని, ఒక్క ఇన్నింగ్స్ తో అతడు మళ్లీ గాడినపడతాడని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఫామ్ తాత్కాలికం-క్లాస్ శాశ్వతం అనే క్రికెట్ నానుడిని ఉదహరిస్తున్నారు. కాగా నేటి మ్యాచ్ లో విరాట్ కోహ్ల ఓపెనర్ గా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ సంకేతాలు ఇచ్చాడు.

ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో ఒక మార్పు జరిగింది. ఓపెనర్ అనుజ్ రావత్ స్థానంలో రజత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. అటు, రాజస్థాన్ జట్టులో ఒబెద్ మెక్ కాయ్ స్థానంలో కుల్దీప్ సేన్, కరుణ్ నాయర్ స్థానంలో డారిల్ మిచెల్ జట్టులోకి వచ్చారు.

Virat Kohli
Royal Challengers Bengaluru
Rajasthan Royals
Toss
IPL
  • Loading...

More Telugu News