CM Jagan: ఏపీలో 26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్న విషయం అందరికీ తెలియాలి: కలెక్టర్లతో సీఎం జగన్

CM Jagan review on govt policies

  • నేడు కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం సమీక్ష
  • ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న సీఎం
  • ప్రజల పట్ల మానవీయ దృక్పథం కనబర్చాలని సూచన 

స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీలో 26 జిల్లాలు ఎందుకు ఏర్పాటు చేశామన్నది అందరికీ తెలియాలని అన్నారు. పరిపాలన అనేది సులభతరంగా ఉండాలని, ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువలో ఉండాలని అభిప్రాయపడ్డారు. అధికారులు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని, ప్రజల పట్ల మరింత మానవీయ దృక్పథంతో మెలగాలని సూచించారు.

ఇళ్ల నిర్మాణం గురించి మాట్లాడుతూ, తొలి దశలో రాష్ట్రంలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సీఎం జగన్ తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పడిందని వెల్లడించారు. ఈ కేసుల పరిష్కారం కోసం అధికారులు ప్రయత్నించాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందాలని, అందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్లు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు.

  • Loading...

More Telugu News