WhatsApp: మీ వాట్సాప్ ఎన్ని డివైజ్ లలో లింక్ చేసి ఉందో తెలుసా..?

How to unlink your WhatsApp account from multiple devices

  • వద్దనుకుంటే లాగవుట్ చేసుకోవచ్చు
  • స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ సెట్టింగ్స్ లో ఆప్షన్
  • లింక్డ్ డివైజెస్ ఎంపిక చేసుకుంటే తెలుస్తుంది

వాట్సాప్ ఇటీవలే మల్టీ డివైజ్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. అంటే వాట్సాప్ ను ఒకటికి మించిన పరికరాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రాథమిక డివైజ్ లో నెట్ కనెక్టివిటీ లేకపోయినప్పటికీ.. లింక్ చేసి ఉన్న ఇతర పరికరాల్లో అదే వాట్సాప్ అకౌంట్ ను వినియోగించుకోవచ్చు. ఒక్క యూజర్ అదనంగా నాలుగు డివైజ్ లలో ఒకటే వాట్సాప్ ఖాతాను వినియోగించుకోవచ్చు. ఇప్పుడు ఇందుకు సంబంధించి కొత్త ఫీచర్లను సంస్థ జోడించింది. 

ఫోన్లో వాట్సాప్ ఉంది. దాన్ని సిస్టమ్ కు లింక్ చేసుకున్నాం. కానీ, సిస్టమ్ లో లాగవుట్ చేయడం మర్చిపోయారనుకోండి. అప్పుడు ఎలా..? దీన్ని ఫోన్ నుంచే చేసుకోవచ్చు. ఇందుకోసం ఐ ఫోన్ యూజర్లు వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి. దిగువన కుడి భాగంలో సెట్టింగ్స్ కు వెళ్లాలి. సెట్టింగ్స్ మెనూలో లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. అప్పుడు మీ వాట్సాప్ ఏ ఏ పరికరాలకు లింక్ చేసి ఉందన్నది తెలుస్తుంది. లాగవుట్ చేయాలనుకున్న పరికరాన్ని ఎంపిక చేసుకుని ముందుకు వెళ్లాలి.

ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ యాప్ ను తెరవాలి. కుడి చేతి వైపు పై భాగంలో కనిపించే మూడు చుక్కల వద్ద ట్యాప్ చేయాలి. అక్కడి మెనూలో లింక్డ్ డివైజెస్ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు వాట్సాప్ ఎన్ని చోట్ల లింక్ చేసిందన్నది తెలుస్తుంది. వద్దనుకున్న పరికరాన్ని ఎంచుకుని లాగవుట్ చేస్తే సరిపోతుంది.

  • Loading...

More Telugu News