Singireddy Niranjan Reddy: తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడతాం: మంత్రి నిరంజన్ రెడ్డి
![niranjan reddy slams opposition leaders](https://imgd.ap7am.com/thumbnail/cr-20220426tn626799a58cd05.jpg)
- మొదటి నుంచీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించారన్న నిరంజన్ రెడ్డి
- ఇప్పుడు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆరోపణ
- తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను గురుతరంగా భావిస్తున్నామని వ్యాఖ్య
తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడతామని రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మొదటి నుంచీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారు ఇప్పుడు కూడా కుట్రలు పన్నుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతను గురుతరంగా భావించి నిర్వర్తిస్తోందని చెప్పుకొచ్చారు.
అప్పట్లో తెలంగాణ ఉద్యమానికి దూరంగా ఉన్న వారు ఇప్పుడు తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏడేళ్ల సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.7 శాతంగా ఉందని, భారత దేశ సగటు ఆర్థిక వృద్ధి రేటు ఆరు శాతం మాత్రమేనని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.