Sanjana Galrani: కుటుంబం కంటే స్నేహితులే నయం అంటున్న సంజన... ఎందుకంటే...!
![Sanjana says some times friends better than family members](https://imgd.ap7am.com/thumbnail/cr-20220425tn6266c4c0683ff.jpg)
- తెలుగులో పలు చిత్రాల్లో నటించిన సంజన
- కొంతకాలం కిందట డ్రగ్స్ కేసులో చిక్కుకున్న నటి
- జైలుకు వెళ్లొచ్చిన వైనం
- పాషా అనే డాక్టర్ తో ప్రేమ వివాహం
దక్షిణాదిలో అనేక చిత్రాల్లో నటించి, వివిధ భాషల అభిమానులకు దగ్గరైన కన్నడ భామ సంజన గల్రానీ త్వరలో తల్లికాబోతోంది. తెలుగులోనూ సంజన పలు చిత్రాల్లో నటించింది. కొంతకాలం కిందట డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుకు కూడా వెళ్లొచ్చిన సంజన... పాషా అనే డాక్టర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. తాజాగా సంజనకు సీమంతం జరిగింది. స్నేహితులే ఆమెకు అన్నీ అయ్యారు. వారే సంజనకు సీమంతం జరిపించి, ఆమె ముఖంలో కాంతులు నింపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సంజన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే నయం అని భావోద్వేగాలతో స్పందించింది. తన దక్షిణాది మిత్రులు ఎంతో ప్రేమగా సీమంతం చేశారని వెల్లడించింది. తనకు ప్రస్తుతం 8 నెలలు నిండుతున్నాయని, మరో నెల రోజుల్లో బిడ్డను చూస్తానని సంజన సంతోషం వ్యక్తం చేసింది. ఎంతో ప్రేమను చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు అంటూ తన పోస్టులో పేర్కొంది.
![](https://img.ap7am.com/froala-uploads/20220425fr6266c48cc6fb0.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220425fr6266c49e9f4b7.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20220425fr6266c4b1ba3df.jpg)