ola: ఎల‌క్ట్రిక్ బైక్‌ల పేలుళ్ల వేళ 1,441 ఈ-స్కూట‌ర్లను రీకాల్ చేస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్

ola recalls 1441 scooters

  • ఇటీవ‌ల పూణెలో ప్ర‌మాదానికి గురైన ఈ-స్కూట‌ర్ 
  • ఆ బ్యాచ్‌లో తయార‌యిన అన్ని బైక్‌ల‌నూ ప‌రిశీలించాల‌ని ఓలా నిర్ణ‌యం
  • బ్యాట‌రీలు, థ‌ర్మ‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌పై స‌ర్వీస్ ఇంజ‌నీర్ల స‌మీక్ష

దేశ ప్ర‌జ‌లు ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇప్పుడిప్పుడే ఆస‌క్తి పెంచుకుంటూ కొనుగోళ్లు జ‌రుపుతున్నారు. ఈ సానుకూల ప‌రిణామం వ‌ల్ల కాలుష్యం త‌గ్గుతుంద‌ని, పెట్రోలు వినియోగం, దిగుమ‌తులు త‌గ్గుతాయ‌ని భావిస్తోన్న వేళ అనేక ప్రాంతాల్లో ఈ-బైక్‌ల పేలుళ్లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వాటి బ్యాటరీల నాణ్యత, ఇత‌ర కారణాలు ఈ ప్రమాదాలకు కారణాలని నిపుణులు చెబుతోన్న వేళ ఓలా ఎల‌క్ట్రిక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పూణెలో ఇటీవ‌ల జ‌రిగిన ప్ర‌మాదాన్ని దృష్టిలో ఉంచుకుని 1,441 యూనిట్ల ఈ-బైక్‌ల‌ను రీకాల్ (వెన‌క్కి పిలిపించ‌డం) చేస్తున్న‌ట్లు తెలిపింది. 

ఇటీవ‌ల‌ ప్ర‌మాదానికి గురైన ఈ-స్కూట‌ర్ తో పాటు ఆ బ్యాచ్‌లో తయార‌యిన అన్ని బైక్‌ల‌నూ ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఓలా తెలిపింది. అందుకే ఆ బైక్‌ల‌ను వెన‌క్కి పిలిపిస్తున్న‌ట్లు వివ‌రించింది. ఆ స్కూట‌ర్ల‌లోని బ్యాట‌రీలు, థ‌ర్మ‌ల్ వ్య‌వ‌స్థ‌ల‌పై త‌మ స‌ర్వీస్ ఇంజ‌నీర్లు స‌మీక్ష నిర్వ‌హిస్తార‌ని చెప్పింది. భార‌త బ్యాట‌రీ ప్ర‌మాణాలతో పాటు ఐరోపా ప్ర‌మాణాల‌కు కూడా త‌మ స్కూట‌ర్ల‌లో అమ‌ర్చిన బ్యాట‌రీలు స‌రిపోతాయ‌ని తెలిపింది.

  • Loading...

More Telugu News